ఉగ్రదాడి పిరికిపంద చర్య
సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన దాడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఖండించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం [more]
సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన దాడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఖండించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం [more]
సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన దాడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఖండించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన కేసీఆర్ పేలుడులో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనతో తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యానని, ఈ పరిస్థితుల్లో తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటానని, పార్టీ శ్రేణులు కూడా వేడుకలు జరపవద్దని ఆయన కోరారు. ఇక, ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా వైఎస్ జగన్ అభివర్ణించారు. ఉగ్రమూకల దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సైనికులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.