బ్రేకింగ్ : ఈనెల 11 నుంచి శ్రీవారి దర్శనం

ఈ నెల 11వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవారి భక్తులకు అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నా [more]

Update: 2020-06-05 07:23 GMT

ఈ నెల 11వ తేదీ నుంచి తిరుమలలో శ్రీవారి భక్తులకు అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నా అది స్థానికులకు మాత్రమేనని చెప్పారు. ఈ నెల 11వ తేదీ నుంచి భక్తులు రావచ్చన్నారు. అయితే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే అనుమతివ్వడం జరుగుతుందన్నారు. పదేళ్ల లోపు పిల్లలు, అరవై ఏళ్ల పైబడిన వారికి అనుమతించబోమన్నారు. అలాగే దేశంలో కంటెయిన్ మెంట్ ప్రాంతాల్లో ఉంటున్న వారిని కూడా దర్శనానికి అనుమతించబోమని చెప్పారు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించే దర్శనాలకు అనుమతిస్తామన్నారు. ప్రతి రోజూ ఏడు వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. భక్తులు మాస్క్ లు విధిగా ధరించాలన్నారు. భౌతిక దూరం పాటించాలన్నారు. కాలినడకన ఒక్క అలిపిరి మార్గం నుంచే రావాల్సి ఉంటుందన్నారు. భక్తులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే అనుమతిస్తామని చెప్పారు. ప్రధానంగా కల్యాణ కట్ట, అన్నప్రసాదాల వితరణ వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తులు కూడా టీటీడీకి సహకరించాలని కోరారు.

Tags:    

Similar News