శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల.. కొద్దినిమిషాలకే కోటా పూర్తి
తిరుమల తిరుపతి దేవస్థానం ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు
తిరుమల తిరుపతి దేవస్థానం ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్లను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయగా.. 10 గంటలలోపే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఫిబ్రవరి నెలు సంబంధించిన ఆన్ లైన్ కోటా టికెట్లు 40 నిమిషాల్లోపే అయిపోవడంతో భక్తులు నిరాశచెందారు.
Also Read : జీతాల లొల్లి... తాము బిల్లులు చేయలేమంటూ?
టికెట్ బుకింగ్ చేసే సమయంలో చాలా మందికి వివరాలు సబ్మిట్ చేసిన తర్వాత.. పేమెంట్ గేట్ వే సరిగ్గా కనెక్ట్ అవక.. టికెట్లు బుక్ కాని పరిస్థితి ఏర్పడింది. దాంతో భక్తులు నిరాశకు గురయ్యారు. కాగా.. రేపు ఉదయం 9 గంటలకు టైమ్ స్లాట్ సర్వదర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. రోజుకు 10వేల కోటా చొప్పున సర్వదర్శనం టికెట్లను విడుదల చేయనుంది.
Also Read : మరో మూడు రోజులే సమయం.. ఛార్జీలు పెరగనున్నాయ్
కరోనా కారణంగా.. కొన్ని నెలలుగా టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్ లోనే విడుదల చేస్తోంది. అదీ పరిమిత సంఖ్యలో మాత్రమే విడుదల చేస్తుండటంతో.. శ్రీవారి భక్తులు నిరాశ చెందుతున్నారు. ఫిబ్రవరి నుంచి కోటా పెంచుతారన్న ప్రచారం జరగ్గా.. మళ్లీ కరోనా విజృంభిస్తుండటంతో టీటీడీ ఆ ఆలోచన మానుకున్నట్లు తెలుస్తోంది. అలాగే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తమ రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా.. 48 గంటల ముందు చేయించుకున్న కరోనా నిర్థారణ పరీక్ష (కరోనా నెగిటివ్) సర్టిఫికేట్ చూపిస్తేనే.. దర్శనానికి అనుమతిస్తున్నారు.