Weather Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత.. ఎండాకాలాన్ని తలపిస్తున్న వాతావరణం

ఎండాకాలాన్ని తలపిస్తుంది. ఆగస్గు నెల వచ్చినా, వర్షాలు పడుతున్నా సెగ తగ్గలేదు. ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.

Update: 2024-08-18 12:09 GMT

ఎండాకాలాన్ని తలపిస్తుంది. ఆగస్గు నెల వచ్చినా, వర్షాలు పడుతున్నా సెగ తగ్గలేదు. ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. దీనికి తోడు దోమల బెడదఎక్కువగా ఉండటంతో వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. సాధారణంగా జూన్, జులై నుంచి వాతావరణంచల్లబడుతుంది. ఆగస్టు నుంచి ఇక చలి వాతావరణం మొదలవుతుంది. జనవరి నాటికి చలి పీక్ కు చేరుకుంటుంది. కానీ ఆగస్టు నెలలో మూడో వారంలోకి ప్రవేశించినప్పటికీ ఇంకా ఎండవేడిమి తగ్గలేదు.

గతంలో లేని...
ఇలాంటి వాతావరణం గతంలో ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగానే ఈ రకమైన ఇబ్బందులు ప్రజలు పడాల్సివస్తుందని చెబుతున్నారు. ఈ ఏడాది ఎండాకాలం మార్చి నుంచే ప్రారంభ మయింది. మార్చి నెల నుంచి ఆగస్టు నెల వరకూ తగ్గకపోవడంతోప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా వాతావరణంలో మార్పుల కారణంగా దోమలు పెరిగాయంటున్నారు. పగటి పూట ఎండ వేడిమి, రాత్రి పూట ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.
దోమల కారణంగా...
దోమల కారణంగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో పాటు విషజ్వరాలు కూడా పెరిగాయి. ఆసుపత్రులన్నీ రోగులతో టకిటలాడుతున్నాయి. ప్రజలు వేడిచల్లార్చిన నీటినే తాగాలని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో ఇన్‌పేషెంట్లుగా చేరే వారిసంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు లేకపోవడం, గంటల తరబడి వైద్యం కోసం వేచి చూస్తుండటంతో ప్రయివేటు ఆసుపత్రులను ఎక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యం టెస్ట్‌ల పేరిట దోపిడీకి దిగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నాళ్లు ఈ వాతావరణం ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.


Tags:    

Similar News