చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన ఉండవల్లి

మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. ఏపీలో ఉన్న రాజకీయ నేతల కేసులను వర్చువల్ విధానంలో విచారించాలని [more]

Update: 2020-10-17 07:14 GMT

మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. ఏపీలో ఉన్న రాజకీయ నేతల కేసులను వర్చువల్ విధానంలో విచారించాలని ఆయన తన లేఖలో కోరారు. ఇందుకోసం విదేశాల్లోగా మన దేశంలోనూ వర్చువల్ న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. ముఖ్యమైన కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ కోరారు. జగన్ తన అభిప్రాయాన్ని ప్రజల్లో వెళ్లేందుకే దానిని ప్రచారం చేశారని చెప్పారు. గతలంలో ఎన్టీఆర్ కూడా ప్రజాసేవకు కోర్టులు అడ్డుపడుతున్నాయన్న విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తు చేశారు.

Tags:    

Similar News