జగన్ లేఖపై అభ్యంతరం తెలిపిన ఉండవల్లి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణఫై జగన్ ప్రధాని మోదీ కి లేఖ రాయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. [more]

Update: 2021-02-08 07:44 GMT

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణఫై జగన్ ప్రధాని మోదీ కి లేఖ రాయడం వల్ల పెద్దగా ఉపయోగం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆ లెటర్ ను ప్రధాని కార్యాలయం పక్కన పడేస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఈ లేఖలో బడ్జెట్ బాగుందని జగన్ ప్రశసించడం తనను ఆశ్చర్యపరిచిందని తెలిపారు. వైసీపీ ఎంపీలేమో బడ్జెట్ బాగా లేదని అంటుంటే జగన్ మాత్రం బడ్జెట్ బాగుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అన్ని పార్టీలూ కలసి పోరాడితేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగిపోయే అవకాశముందని ఆయన తెలిపారు.

Tags:    

Similar News