జగన్ కు ఉండవల్లి లేఖ

మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. తెలుగు యూనివర్సిటీకి చెందిన 20 ఎకరాలను పేదల ఇళ్ల స్థలాల [more]

Update: 2020-02-22 07:07 GMT

మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. తెలుగు యూనివర్సిటీకి చెందిన 20 ఎకరాలను పేదల ఇళ్ల స్థలాల కోసం తీసుకోవడాన్ని ఆయన తప్పు పట్టారు. తెలుగు యూనివర్సిటీని ఇంకా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన జరగలేదని, పేదల ఇళ్ల స్థలాల కోసం తెలుగు యూనివర్సిటీ స్థలాన్ని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ కు రాసిన లేఖలో కోరారు.

Tags:    

Similar News