ఉండవల్లి కొత్త సవాల్ ఇదే
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లకుండా ఉండి ఉంటే ఫలితాలు మరో రకంగా ఉండేవని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లకుండా ఉండి ఉంటే ఫలితాలు మరో రకంగా ఉండేవని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. [more]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లకుండా ఉండి ఉంటే ఫలితాలు మరో రకంగా ఉండేవని మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ఓటమి కారణం చంద్రబాబు కూడా ఒక కారణమని చెప్పారు. చంద్రబాబు ప్రచారానికి వెళ్లకుండా ఉండి ఉంటే ఫలితాలు ఖచ్చితంగా మారేవని ఆయన తెలిపారు. చంద్రబాబు శ్వేతపత్రాలన్నీ అబద్ధాలేనని ఉండవల్లి కొట్టిపారేశారు. పోలవరం ప్రాజెక్టుపై ఎందుకు శ్వేతపత్రం విడుదల చేయలేదని ఆయన డిమాండ్ చేశారు. శ్వేతపత్రంలో వెల్లడించిన ఎల్ఈడీ బల్బుల కాంట్రాక్టులో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై చర్చకు తాను ఎవరితోనైనా సిద్ధమని ఉండవల్లి సవాల్ విసిరారు. శ్వేతపత్రాలు విడుదల చేస్తూ చంద్రబాబు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు ఉండవల్లి.