జగన్ కు ఉండవల్లి హెచ్చరిక
వైఎస్ జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. విద్యుత్తు కోతలతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్నారు. విద్యుత్తు కోతల నెపాన్ని చంద్రబాబు, మోదీపైన నెట్టినా [more]
వైఎస్ జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. విద్యుత్తు కోతలతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్నారు. విద్యుత్తు కోతల నెపాన్ని చంద్రబాబు, మోదీపైన నెట్టినా [more]
వైఎస్ జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. విద్యుత్తు కోతలతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్నారు. విద్యుత్తు కోతల నెపాన్ని చంద్రబాబు, మోదీపైన నెట్టినా ఉపయోగం ఉండదని, అది ప్రభుత్వంపైనే ప్రభావం చూపుతుందన్నారు. జగన్ ప్రభుత్వానికి మెజారిటీ చూసుకుని శాశ్వతం అనుకోవద్దని, ఎమ్మెల్యేలను కూడా సంతృప్తి పర్చాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే తనకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని ఫీలవ్వాలన్నారు. లేకుంటే అసంతృప్తి పెరుగుతుందన్నారు. వైసీపీది జాతీయ పార్టీ కాదని, ప్రాంతీయ పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు.
ఎమ్మెల్యేలే తిరగబడతాారు….
జాగ్రత్తగా వ్యవహరించకుంటే మీ మనుషులే మీ మీద తిరగబడతారని ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. 51 శాతం ఓట్లతో 1972లో కాంగ్రెస్ 219 సీట్లు సాధిస్తే తొమ్మిది నెలల్లోనే అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావును దింపేశారన్నారు ఉండవల్లి. అలాగే 1994లో ఎన్టీఆర్, కమ్యునిస్టులు కలసి పోటీ చేసి 54 శాతం ఓట్లతో 213 సీట్లు సాధిస్తే తొమ్మదినెలలకు ఎన్టీ రామారావును ఎమ్మెల్యేలు పదవి నుంచి దించేశారన్నారు. జగన్ కూడా ఇది గుర్తుంచుకుంటే బాగుంటుందని ఉండవల్లి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.