రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జీత్ పటేల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఉర్జీత్ ప్రకటించారు. రిజర్వు బ్యాంకులో వివిధ హోదాల్లో సేవలంధించడం తనకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో దూరంగా కారణంగా ఆయన రాజీనామా చేస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 2016లో ఉర్జీత్ ఆర్బీఐ గవర్నర్ గా నియమితులయ్యారు. ఆయన హయాంలోనే పెద్దనోట్ల రద్దు జరిగింది. 2019 సెప్టెంబర్ వరకు ఉర్జీత్ పదవీకాలం ఉన్నా ఆయన 10 నెలల ముందుగానే రాజీనామా చేశారు.