అందరి అంగీకారంతోనే మఠాధిపతి ఎంపిక

బ్రహ్మంగారి మఠానికి సంబంధించి పీఠాధిపతిని ఈరోజు సాయంత్రం ప్రకటిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. పీఠాధిపతి ప్రమాణస్వీకారానికి తెలుగు రాష్ట్రాల నుంచి 150 మంది [more]

Update: 2021-06-13 06:50 GMT

బ్రహ్మంగారి మఠానికి సంబంధించి పీఠాధిపతిని ఈరోజు సాయంత్రం ప్రకటిస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. పీఠాధిపతి ప్రమాణస్వీకారానికి తెలుగు రాష్ట్రాల నుంచి 150 మంది పీఠాధిపతులు హాజరవుతారని ఆయన తెలిపారు. పీఠాధిపతి ఎంపికలో అందరూ సహకరించాలని వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. కుటుంబ సభ్యులు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఎవరికీ అన్యాయం జరగకుండా పీఠాధిపతి ఎన్నిక సంప్రదాయంగా జరిగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. మఠాధిపతి పై ఎన్నిక సమస్యను పరిష్కరించేందుకు సీనియర్ అధికారులను నియమించామని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు.

Tags:    

Similar News