Vellampalli : మంత్రిని అడ్డుకున్న సీఐ.. ఆగ్రహం

దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు. దుర్గగుడికి వచ్చిన ఆయనను సీఐ అడ్డుకున్నారు. దీంతో సీఐ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. [more]

Update: 2021-10-13 04:41 GMT

దేవాదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను పోలీసులు అడ్డుకున్నారు. దుర్గగుడికి వచ్చిన ఆయనను సీఐ అడ్డుకున్నారు. దీంతో సీఐ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిన్న ఎంపీ కేశినేనినాని వాహనాన్ని కూడా ఇంద్రకీలాద్రిపైకి పోలీసులు అనుమతించలేదు.

సీఐపై ఆగ్రహం…..

తనను అడ్డుకున్న సీఐపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ప్రొటోకాల్ పాటించడం కూడా తెలియదా అని ఆయన మండిపడ్డారు. పక్కనే ఉన్న అధికారులు సర్దిచెప్పడంతో వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. తమ పని తాము చేసుకోనివ్వమని పోలీసు ఉన్నతాధికారులు కోరుతున్నారు.

Tags:    

Similar News