రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు?

ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి పదవికి పదోన్నతిని కల్పించాల్సి ఉంది. సంప్రదాయంగా వస్తుదన్నది అదే.

Update: 2022-06-09 12:25 GMT

ఈసారి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని పోటీ చేయిస్తుంది? సంప్రదాయాన్ని అనుసరిస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి పదవికి పదోన్నతిని కల్పించాల్సి ఉంది. సంప్రదాయంగా వస్తుదన్నది అదే. ఉప రాష్ట్రపతిని రాష్ట్రపతిని చేసి, ఉప రాష్ట్రపతిగా కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారు. కానీ 2024 లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.

వెంకయ్యకు...?
ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే వెంకయ్యనాయుడికి రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం కష్టమనే చెబుతున్నారు. దళిత, మైనారిటీ నేతల వైపు ఈసారి కూడా బీజేపీ మొగ్గు చూపుతుందంటున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది. ఈ నెల 15వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ రానుంది. వచ్చే నెల 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. జులై 21వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. జులై 25వ తేదీన కొత్త రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేస్తారు.
కోవింద్ ను కూడా...?
అయితే మరోసారి ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కొనసాగించే ఆలోచనలో బీజేపీ లేదు. ఈసారి మైనారిటీ నేతలకు ఎంపిక చేసే అవకాశముందంటున్నారు. గులాం నబీ ఆజాద్ ను ఎంపిక చేసే అవకాశముంది. ఆజాద్ కాంగ్రెస్ లో ఉన్నా ఆ పార్టీ పట్టించుకోవడం లేదు. ఇటీవల రాజ్యసభ ఎన్నికలకు కూడా ఆజాద్ ను దూరం పెట్టింది. ఆజాద్ ను రాష్ట్రపతిగా ఎంపిక చేయడంపై బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు విన్పిస్తున్నాయి. ఆయనను ఎలా చేస్తారని? ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నుంచి ఈ ప్రతిపాదనకు గండి పడే వీలుంటుందన్నారు.
బీజేపీ ప్రతిపాదించిన.....
రాష్ట్రపతి ఎన్నికలలో ఈసారి కూడా అధికార బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం, ప్రాంతీయ పార్టీల్లోనూ ఐక్యత లేకపోవడం, వైసీపీ, టీడీపీ బిజూ జనతా దళ్, అన్నాడీఎంకే వంటి పార్టీలు బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థిగా నిలుస్తారన్నది వాస్తవం. అందుకే కొత్త రాష్ట్రపతి ఎవరు అన్న దానిపై హస్తినలో జోరుగా చర్చ జరుగుతుంది. ఊహించని పేరు వస్తుందన్నది బీజేపీ వర్గాల నుంచి విన్పిస్తున్న సమాచారం.


Tags:    

Similar News