నవ్వి పోతారని కూడా సిగ్గు లేదా?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనం నవ్విపోతారని కూడా సిగ్గులేకుండా వారం రోజులు సీఎం [more]

Update: 2021-05-10 00:38 GMT

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనం నవ్విపోతారని కూడా సిగ్గులేకుండా వారం రోజులు సీఎం కుర్చీకావాలని అడగమేంటని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పథ్నాలుగేళ్లు సీఎంగా ఉండి నువ్వు పొడిచిందేమిటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ప్రజలను దోచుకుని తిన్నందుకే ఇంటికి పంపించారన్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోయినట్లున్నారని విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. జగన్ ప్రభుత్వం అన్ని రకాలుగా కరోనా బాధితులను ఆదుకుంటుందని, అయినా చంద్రబాబు ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని మాత్రం వదలడం లేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News