నేడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ నేడు సీబీఐ కోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే సీబీఐ తన వాదనను లిఖితపూర్వకంగా సమర్పించింది. [more]

Update: 2021-08-23 05:22 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ నేడు సీబీఐ కోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే సీబీఐ తన వాదనను లిఖితపూర్వకంగా సమర్పించింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఈరోజు రఘురామ తరుపున న్యాయవాదులు సీబీఐ కోర్టులో తమ వాదనలను విన్పించనున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి దీనిపై కౌంటర్ దాఖలు చేశారు.

Tags:    

Similar News