కేసీఆర్ సర్వేలపై విజయశాంతి ఏమన్నారంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మరోసారి సెటైర్లు వేశారు. సర్వేల పేరుతో ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని విజయశాంతి అన్నారు. నాగార్జున సాగర్ [more]

Update: 2021-02-28 00:56 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మరోసారి సెటైర్లు వేశారు. సర్వేల పేరుతో ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని విజయశాంతి అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తామే గెలుస్తామని, సర్వేల్లో ఇదే స్పష్టమయిందని కేసీఆర్ పదే పదే చెప్పడం ఓటమి భయంతోనేనని విజయశాంతి అన్నారు. అవన్నీ కేసీఆర్ ఊహాగానాలు మాత్రమేనని అన్నారు. పిచ్చి సర్వేలను కేసీఆర్ ప్రజల ముందు పెట్టారన్నారు. ఈ అసత్యాల ముఖ్యమంత్రి బండారాన్ని త్వరలో బండి సంజయ్ బయటపెట్టనున్నారని విజయశాంతి వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News