చంద్రబాబుకు ఆ నిక్ నేమ్ పెట్టారు

కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు గానూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఢిల్లీలో [more]

Update: 2019-05-20 07:48 GMT

కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు గానూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఢిల్లీలో చంద్రబాబును అందరూ ఫెవికాల్ బాబా అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా, వీళ్లను ఏకంగా చేస్తాని అని అంటున్నందునే ఈ నిక్ నేమ్ తగిలించారని చెప్పారు. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఏపీ వినాశనాన్ని తెలంగాణ కోరుకుంటుందని బోరున విలపించిన చంద్రబాబు ఇప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన టీడీపీని ఉత్తరాధి నేతల పాదాల ముందు పడేశాడని అన్నారు.

Tags:    

Similar News