‘మీడియా నయీం’ రవిప్రకాశ్ తప్పించుకోలేరు

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, నటుడు శివాజీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. మీడియా ‘నయీం’ నేరాలపై దర్యాప్తు అధికారులు పక్కా ఆధారాలు సేకరించారని, [more]

Update: 2019-05-17 11:04 GMT

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్, నటుడు శివాజీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. మీడియా ‘నయీం’ నేరాలపై దర్యాప్తు అధికారులు పక్కా ఆధారాలు సేకరించారని, గరుడ పురాణం బ్రోకర్ శొంఠినేని శివాజీ కూడా తప్పించుకోలేడన్నారు. 14 నెలల క్రితం రవిప్రకాశ్ తనకు షేర్లు విక్రయించాడని రాసుకున్న అగ్రిమెంటు పత్రం తాజా సృష్టించిందేనని వెల్లడైందన్నారు. అప్పట్లో నట్వర్ లాల్ అనే చీటర్ తాజ్ మహాల్ నే అమ్మేశాడని తెలిసి విస్తుపోయామని, పోర్జరీ, నిధుల, స్వాహా, బోగస్ షేర్ల అమ్మకాలు, టీవీ9 ట్రేడ్ మార్క్, కాపీరైట్ అమ్మకాలు… ఇలా రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్న ‘మెరుగైన సమాజం’ ప్రొడ్యూసర్ మోసాలు నైజీరియన్ మోసగాళ్లను తలపిస్తున్నాయని విమర్శించారు.

Tags:    

Similar News