గ‌వ‌ర్న‌ర్ కు విజ‌య‌సాయిరెడ్డి లేఖ‌

పోలీస్ శాఖ‌లో పోస్టింగ్ ల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుతూ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో డీఎస్పీల [more]

Update: 2019-05-06 11:18 GMT

పోలీస్ శాఖ‌లో పోస్టింగ్ ల‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరుతూ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో డీఎస్పీల పోస్టింగ్ వ్య‌వ‌హారం అడ్డ‌గోలుగా జ‌రిగింద‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల ముందు ఒకే సామాజ‌క‌వ‌ర్గానికి చెందిన 37 మందికి చంద్ర‌బాబు డీఎస్పీలుగా ప‌దోన్న‌త‌ులు క‌ల్పించార‌ని ఆరోపించారు. సీనియారిటీని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా, రొటేష‌న‌ల్ రూల్స్ పాటించ‌కుండా అడ్డ‌గోలుగా ప్ర‌మోష‌న్లు ఇచ్చార‌ని ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపించి ఆరోప‌ణ‌లు రుజువు అయితే క‌చ్చితం ప‌దోన్న‌తుల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరారు.

Tags:    

Similar News