టీడీపీ వారిని ఆ ప‌ద‌వుల్లో ఎలా నియ‌మిస్తారు..?

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కీల‌క‌మైన ఇన్ఫ‌ర్మేష‌న్ క‌మిష‌న‌ర్లుగా తెలుగుదేశం పార్టీ సానుభూతిప‌రుల‌ను నియ‌మించ‌డం ప‌ట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆ [more]

Update: 2019-05-10 11:53 GMT

నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా కీల‌క‌మైన ఇన్ఫ‌ర్మేష‌న్ క‌మిష‌న‌ర్లుగా తెలుగుదేశం పార్టీ సానుభూతిప‌రుల‌ను నియ‌మించ‌డం ప‌ట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యంకు లేఖ రాశారు. ఇన్ఫ‌ర్మేష‌న్ క‌మిష‌న‌ర్ల నియామ‌కాన్ని నాలుగేళ్ల పాటు జ‌ర‌ప‌కుండా ఎన్నిక‌ల వేళ కోడ్ ఉన్న‌ప్పుడు హ‌డావుడిగా నియ‌మించార‌ని పేర్కొన్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏ పార్టీకి అనుబంధంగా లేని వారిని ఈ ప‌ద‌వుల్లో నియ‌మించాల‌ని, కానీ ప్ర‌భుత్వం నియ‌మించిన ఐలాపురం రాజా, శ్రీరాంమూర్తిలు టీడీపీలో ప‌నిచేస్తార‌ని ఆరోపించారు. ఐలాపురం రాజా విజ‌య‌వాడ‌లో ఓ హోట‌ల్ యాజ‌మాని అని, శ్రీరాంమూర్తి విద్యాశాఖ మంత్రి ప్రైవేట్ సెక్ర‌ట‌రీ అని, వీరిద్ద‌రూ టీడీపీ సానుభూతిప‌రుల‌ను పేర్కొన్నారు. 2017లో ఆరుగురు ఆర్టీఐ క‌మిష‌న‌ర్ల‌ను నియ‌మిస్తే వారికి రాజ‌కీయాల‌తో సంబంధం ఉన్నందున వారి నియామ‌కాన్ని సుప్రీం కోర్టు ర‌ద్దు చేసింద‌ని, ఇప్ప‌టికైనా పార‌ద‌ర్శ‌కంగా ఆర్టీఐ క‌మిష‌న‌ర్ల నియామ‌కం ఉండేలా చూడాల‌ని కోరారు.

Tags:    

Similar News