బెజవాడకు కొత్త బాస్ వచ్చారు

విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్ గా శ్రీనివాసులు నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు విజయవాడ అదనపు పోలీసు కమిషనర్ గా శ్రీనివాసులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. [more]

Update: 2020-06-13 06:39 GMT

విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్ గా శ్రీనివాసులు నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు విజయవాడ అదనపు పోలీసు కమిషనర్ గా శ్రీనివాసులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీనివాసులు విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేశారు. ప్రస్తుత పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు రైల్వే డీజీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గత రెండున్నర సంవత్సరాల నుంచి ద్వారకా తిరుమలరావు విజయవాడ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గా బి.శ్రీనివాసులు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటివరకు విజయవాడ అదనపు పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహించారు . ఎస్పీ దగ్గర నుంచి చివరకు ఐజి వరకు ఇంటెలిజెన్స్ విభాగంలోని శ్రీనివాసులు ఎక్కువ కాలం పని చేశారు. . ఉమ్మడి రాష్ట్రంలో సంవత్సరం పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ గా కూడా పని చేశాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో 16 మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇందులో పలు జిల్లాల ఎస్పీలను కూడా నియమించారు.

Tags:    

Similar News