ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వని గవర్నర్

ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వకూడదని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ [more]

Update: 2021-01-25 04:45 GMT

ఏపీలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎవరికీ అపాయింట్ మెంట్ ఇవ్వకూడదని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అపాయింట్ మెంట్ కోరారు. ఆయనకు ఇవ్వలేదు. ఉద్యోగ సంఘాలు కూడా గవర్నర్ అపాయింట్ మెంట్ ను కోరాయి. దీనికి కూడా రాజ్ భవన్ నో చెప్పింది. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే వీరందరికీ గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చే అవకాశాలున్నాయని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News