గవర్నర్ వద్దకు ఇద్దరూ… వారితో విడివిడిగా

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇటు ఎన్నికల కమిషనర్, అటు చీఫ్ సెక్రటరీతో విడివిడిగా సమావేశమయ్యారు. ఇద్దరితో పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. ప్రధానంగా ఇరువురు పంచాయతీ అధికారులపై [more]

Update: 2021-01-27 05:40 GMT

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇటు ఎన్నికల కమిషనర్, అటు చీఫ్ సెక్రటరీతో విడివిడిగా సమావేశమయ్యారు. ఇద్దరితో పంచాయతీ ఎన్నికలపై చర్చించారు. ప్రధానంగా ఇరువురు పంచాయతీ అధికారులపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు తీసుకోవడాన్ని గవర్నర్ ప్రశ్నించినట్లు తెలిసింది. తాను ఏ పరిస్థితుల్లో వారిద్దరి పై చర్యలు తీసుకున్నానో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ కు వివరించినట్లు చెబుతున్నారు. ఇక చీఫ్ సెక్రటరీ సయితం కోవిడ్ వ్యాక్సిన్, ఎన్నికలు ఏక కాలంలో జరపాల్సి రావడంతో తలెత్తే ఇబ్బందులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరికాసేపట్టో నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్ా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

Tags:    

Similar News