‘జై తెలంగాణ’ అనని వాళ్లకు టిక్కెట్లా..?
తెలంగాణ రాష్ట్ర సమితికి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. తనకు పెద్దపల్లి టిక్కెట్ [more]
తెలంగాణ రాష్ట్ర సమితికి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. తనకు పెద్దపల్లి టిక్కెట్ [more]
తెలంగాణ రాష్ట్ర సమితికి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన లేఖ రాశారు. తనకు పెద్దపల్లి టిక్కెట్ ను చివరి నిమిషంలో నిరాకరించి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ కోసం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా పనిచేయడమే తాను చేసిన ద్రోహమా అని ప్రశ్నించారు. తాను, తన తండ్రి కాకా తెలంగాణ సాధన కోసం రాజీ లేని పోరాటం చేశామన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి టిక్కెట్ ఇవ్వడం ద్వారా పార్టీకి ఎవరు ద్రోహం చేశారో అర్థం అవుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేని వారికి, కనీసం జై తెలంగాణ నినాదం కూడా చేయని వారికి టీఆర్ఎస్ టిక్కెట్లు ఇచ్చారని ఆరోపించారు. ప్రజాస్వామిక తెలంగాణ అవుతుందనుకుంటే నియంతృత్వ పోకడలను కేసీఆర్ ప్రజల మీద రుద్దుతున్నారని అన్నారు. సమయం తక్కువగా ఉండటం వల్ల ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.