2024 గురించి ఆ జ్యోతిష్యుడు ఏమన్నారు?

ఫ్రెంచ్‌ జ్యోతిష్యుడు నోస్ట్రడామస్‌ 2024 గురించి ఏం చెప్పాడు? దీనిమీద చరిత్రకారులు రకరకాల అన్వయాలు చెబుతున్నారు. దాదాపు ఐదు వందల ఏళ్ల కిందట తాను రాసిన ఓ పుస్తకంలో నోస్ట్రడామస్‌ ప్రపంచ భవిష్యత్తును వివరించాడు. ఆయన ఊహలన్నీ నిజమేనని చాలామంది చాలామంది నమ్యుతారు.

Update: 2023-12-31 01:30 GMT

 Nostradamus predict about 2024

ఫ్రెంచ్‌ జ్యోతిష్యుడు నోస్ట్రడామస్‌ 2024 గురించి ఏం చెప్పాడు? దీనిమీద చరిత్రకారులు రకరకాల అన్వయాలు చెబుతున్నారు. దాదాపు ఐదు వందల ఏళ్ల కిందట తాను రాసిన ఓ పుస్తకంలో నోస్ట్రడామస్‌ ప్రపంచ భవిష్యత్తును వివరించాడు. ఆయన ఊహలన్నీ నిజమేనని చాలామంది నమ్ముతారు. జాన్‌ కెన్నడీ హత్య, అమెరికా మీద అల్‌ఖైదా దాడి, కొవిడ్‌ 19 విధ్వంసం... ఇలాంటివన్నీ ఆయన ముందు ఊహించారట. ఆయన అంచనాల్లో కొన్ని అతిశయోక్తులున్నా 70 శాతం వరకూ నిజమయ్యాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2024లో ప్రపంచపు భవిష్యత్తు ఎలా ఉండబోతోందనే విషయం కూడా తన పుస్తకంలో రాసుకున్నారు.

2024లో వాతావరణంలో పెను మార్పులు వస్తాయని, జనం తీవ్ర ఇబ్బందులు పడతారని నోస్ట్రడామస్‌ అంచనా వేశారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులుంటాయని చెప్పారు. ‘భూమి మరింత వేడెక్కుతుంది. నీరు లేక జనం ఇబ్బంది పడతారు, కరువు తాండవిస్తుందని ఆయన తన పుస్తకంలో రాశారు. చైనాతో సముద్ర యుద్ధాలు తప్పవని కూడా తన పుస్తకంలో ఆయన రాశారు. ఇప్పటికే దక్షిణాన ఉన్న సముద్రంపై హక్కుల కోసం, అలాగే ఫిలిప్సైన్స్‌కు పశ్చిమాన ఉన్న సముద్రం కోసం చైనా ఇరుగు పొరుగులతో కయ్యాలు పెట్టుకుంటోంది.

రాజకుటుంబంలో గొడవలు వస్తాయని కూడా నోస్ట్రడామస్‌(Nostradamas)ప్రస్తావించారు.. ఇది బహుశా బ్రిటిష్‌ రాచరికంపై అయి ఉండొచ్చు. చార్లెస్‌ 3 ఇప్పుడు పదవిలో ఉన్నారు. ఆ రాజ కుటుంబంలో మనస్పర్ధలను ఊహించి ఆ జ్యోతిష్యుడు రాసి ఉంటారు. వాటికన్‌కు మరో కొత్త, యువ పోప్‌ వస్తారని ప్రస్తావన కూడా భవిష్యద్దర్శినిలో ఉంది. ఆయన సూటిగా ఏ విషయమూ రాయలేదు. ఓ కోడ్‌ లాంగ్వేజ్‌లా రాశారు. వాటిని ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు అన్వయిస్తున్నారు. ఆయన రాసిన వాతావరణ దుష్ఫలితాలు, కరువు, ఆర్థిక అస్థిరత మన దేశం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.


Full View

Tags:    

Similar News