అర్థం కానిదే 'రాజకీయం'.. కేశినేని నాని

టీడీపీ నేత‌, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మీడియా చిట్‌చాట్‌లో ఆయ‌న‌ మాట్లాడుతూ.. రాజకీయం అర్థం కాకూడదన్నారు.

Update: 2023-08-07 04:28 GMT

టీడీపీ నేత‌, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మీడియా చిట్‌చాట్‌లో ఆయ‌న‌ మాట్లాడుతూ.. రాజకీయం అర్థం కాకూడదన్నారు.. అర్ధం అయితే రాజకీయాలకు పనికిరామన్నారు. రాజకీయం అర్థం అయినా పైకి రాలేమన్నారు. రాజకీయంలో లెఫ్ట్, రైట్, సెంటర్ కొట్టుకుంటూ అర్దం కాకుండా వెళ్ళాలి.. అదే రాజకీయం అని వ్యాఖ్యానించారు.

మాజీ ఎమ్మెల్యే సౌమ్యతో విభేదాల‌పై విలేక‌రులు ప్ర‌శ్నించ‌గా.. ఎవ‌రితో తనకు ఎటువంటి విభేదాలు లేవన్నారు. సౌమ్యకు నాకు ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా..? సౌమ్య, నేను ఏమైనా ఇసుక, బొగ్గు, మైనింగ్‌ వ్యాపారాలు చేస్తున్నామా..? కాంట్రాక్టులు కలిసి చేస్తున్నామా..? కాంట్రాక్టర్ల ద‌గ్గ‌ర ఇద్ద‌రం డ‌బ్బులు దోచుకునేందుకు ప్లాన్ వేసుకుంటామా..? అని ఎదురు ప్ర‌శ్నించారు. సౌమ్య, తాను మంచి మ‌నుషుల‌మ‌న్నారు. మేమిద్ద‌రం క్లీన్ పీపుల్ అంటూ బ‌దులిచ్చారు.

టీడీపీ నుంచి గెలిచినా మొద‌టి నుంచి అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు నాని. అయితే ఎన్నిక‌లు ద‌గ్గ‌ర పడుతున్న వేళ ఆయ‌న త‌మ్ముడు కేశినేని చిన్ని రాజ‌కీయాల్లో యాక్టివ్ కావడంతో నాని అల‌ర్ట్ అయ్యారు. గ‌తంలో సాక్షాత్తు అధినేత చంద్ర‌బాబు వ‌ద్దే అంటిముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన నాని.. టికెట్ భ‌యంతో మ‌ళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యార‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News