వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త

Update: 2018-07-31 11:18 GMT

వాట్సాప్ వినియోగించే వారికి ఆ సంస్థ మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకాలం మెసేజింగ్, వాయిస్, వీడియో కాలింగ్ ద్వారానే విశేష ఆదరణ పొందిన వాట్సాప్ ఇప్పుడు గ్రూప్ కాలింగ్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించింది. ఈ ఫీజర్ ను తీసుకురావడానికి గత సంవత్సరం నుంచే వాట్సాప్ ప్రయత్నిస్తోంది. గత అక్టోబర్ లోనే ఈ విషయం ప్రకటించింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు అందరికీ ఈ ఫిచర్ అందుబాటులోకి వచ్చింది. కేవలం వాట్సాప్ అప్ డేటెడ్ వర్షన్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.

వీడియో, వాయిస్ కాల్స్ కు...

మొదట మెసేజింగ్ వరకే పరిమితమై వచ్చిన వాట్సాప్ తర్వాత వాయిస్ కాలింగ్, 2016 వీడియో కాలింగ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన ఫీచర్ ద్వారా వీడియో, వాయిస్ కాల్స్ లో ఒకేసారి నలుగురు మాట్లాడుకోవచ్చు. అయితే, ముందు ఇద్దరు మాట్లాడుకుని మిగతా వారికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కూడివైపున ఉండే యాడ్ పార్టిసిపెంట్ ఆప్షన్ ద్వారా కొత్తవారిని గ్రూప్ కాలింగ్ లో చేర్చవచ్చు. నెట్ వర్క్ అంతగా లేకున్నా ఈ ఫీచర్ బాగా పనిచేస్తుందని ఆ సంస్థ ప్రకటించింది.

Similar News