ఏపీ 420 అని గుగూల్ లో సెర్చ్ చేస్తే?

ఆంధ్రప్రదేశ్ పరువు ను గుగూల్ సంస్థ బజారున పడేస్తుంది. ఏపీ 420, 420 ఆఫ్ ఏపీ, 420 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ , 420 ఇన్ ఏపీ, హూ [more]

Update: 2020-04-13 06:47 GMT

ఆంధ్రప్రదేశ్ పరువు ను గుగూల్ సంస్థ బజారున పడేస్తుంది. ఏపీ 420, 420 ఆఫ్ ఏపీ, 420 ఆఫ్ ఆంధ్రప్రదేశ్ , 420 ఇన్ ఏపీ, హూ ఈజ్ 420 ఇన్ ఏపీ అని సెర్చ్ చేస్తే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రొఫైల్ వస్తుంది. ఇది సాంకేతికపరమైన తప్పిదమా? లేక కావాలని సెట్ చేశారా? అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. నిన్న ఏపీలో 420 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాని తర్వాతనే ఏపీ 420 అని సెర్చ్ చేస్తే ముఖ్యమంత్రి జగన్ ప్రొఫైల్ వస్తుండటంతో కొందరు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. గుగూల్ సంస్థ టెక్నికల్ సమస్యను తొలగించుకోవాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.

Tags:    

Similar News