బాబును అలా పడేసిందే?

Update: 2018-08-28 03:59 GMT

బార్య,భర్త ల వివాదం తో నెలలు నిండని చిన్నారిని నడిరోడ్డు పై నేలమీద పడేసింది ఆ కర్కశపు తల్లి..అందరూ చూస్తుండ గా జరుగుతున్న ఈ ఘటన..అమ్మ ,నాన్నల బంధాన్ని ప్రశ్నించింది....క్షణికావేశంలో జరుగుతున్న ఈ ఘటనలు..మానవత్వాన్నీ ప్రశ్నిస్తున్నా యి.. ఛీ వీళ్లు మనుషులా అని నిలదీస్తున్నాయి..?

భార్యా భర్తలు గొడవపడి.....

అప్పటిదాకా మామూలు గా .మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరు భార్య, భర్త లు గొడవపడుతున్నారు..ఈ విషయాన్ని చూసిన మహిళ వాళ్ళ చేతిలో ఉన్న బాబును తీసుకొంది...ఈ లోగా ఆ గొడవ చిలికి చిలికి గాలివానాలా మారి. ఈ బిడ్డ తన బిడ్డ కాదు అని పారిపోయే ప్రయత్నం చేసాడు ఆ భర్త. అంతే ఆ మహిళ తన చేతిలో ఉన్న బాబును భర్త మీదకు విసిరేయాలని చూడటం..అప్పటికి భర్త పట్టించుకోకపోవడం తో ఆ కర్కశపు తల్లి చిన్నారిని అందరూ చూస్తుండ గా నేలమీద పడవేసింది. మెహిదీపట్నం నడిరోడ్డు పై జరిగిన ఈ సీన్ చూసిన ఓ వ్యక్తి మొబైల్ లో ఈ తతంగాన్ని వీడియో తీయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. వారిద్దరి ఆవేశానికి ఆ బాలుడు బాల్ గా మారాడు. నెలలు నిండని చిన్నారి అనికూడా చూడకుండా కడుపున పుట్టిన బిడ్డను నడి రోడ్డుపై పడేయడం...అమ్మ తనాన్ని ప్రశ్నించింది మానవత్వం..టెక్నాలజీ పెరిగింది కానీ మనిషి మైండ్ సెట్ దిగజారి పోతుంది అనటానికి ఈ ఇదో ప్రత్యక్ష ఉదాహరణ.

Similar News