ప్రవేశం…మూసివేత…..!!

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించారు. నల్లటి వస్త్రధారణతో బుధవారం తెల్లవారుఝామున వారు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. వీరిద్దరూ యాభై ఏళ్ల లోపు మహిళలే [more]

Update: 2019-01-02 06:35 GMT

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించారు. నల్లటి వస్త్రధారణతో బుధవారం తెల్లవారుఝామున వారు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. వీరిద్దరూ యాభై ఏళ్ల లోపు మహిళలే కావడం విశేషం. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం బిందు, కనకదుర్గ అనే యాభై ఏళ్ల లోపు మహిళలు స్వామిని దర్శించుకుని చరిత్ర కెక్కారు. దీంతో అపచారమంటూ ఆలయ అర్చకులు అయ్యప్ప ఆలయాన్ని మూసివేశారు. సంప్రోక్షణ తర్వాతనే తిరిగి ఆలయాన్ని తెరుస్తామని వారు చెబుతున్నారు.

తొలిసారి దర్శించుకున్న…..

శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి యాభై సంవత్సరాలు దాటని మహిళలకు ప్రవేశంలేదు. దశాబ్దాలుగా సంప్రదాయంగా వస్తున్న ఆచారాన్ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళలకు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు మూడు నెలల క్రితం తీర్పు చెప్పింది. అయితే అప్పటి నుంచి మహిళలు ఆలయంలోకి వెళ్లకుండా అక్కడ ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం పోలీసు సిబ్బందిని పెద్దయెత్తున నియమించినా మహిళలు కోర్టు తీర్పు తర్వాత దర్శనం చేసుకోలేదు. కానీ ఇప్పుడు కళ్లుగప్పి స్వామి వారిని దర్శించుకుని, ఆనందంతో వారు ఆలయం బయట గెంతులు వేసే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆలయ అర్చకులు ఆలయాన్ని మూసివేశారు. కేవలం మహిళలు ఆలయంలోకి వచ్చారని సంప్రోక్షణ కార్యక్రమాన్నిచేపట్టడాన్ని పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు.

Tags:    

Similar News