భర్తే కిడ్నాపర్

సినీఫక్కీలో జరిగిన వివాహిత కిడ్నాప్ కేసు ఇప్పుడు కలకలం సృష్టియిస్తుంది.. అక్క చెల్లి షాపింగ్ కి వెళ్లి వస్తుండగా ముగ్గరు వ్యక్తులు కారు లో వచ్చి బలవంతంగా [more]

Update: 2020-09-29 02:40 GMT

సినీఫక్కీలో జరిగిన వివాహిత కిడ్నాప్ కేసు ఇప్పుడు కలకలం సృష్టియిస్తుంది.. అక్క చెల్లి షాపింగ్ కి వెళ్లి వస్తుండగా ముగ్గరు వ్యక్తులు కారు లో వచ్చి బలవంతంగా చెల్లిని కిడ్నాప్ చేసి కారులో పరారయ్యారు. కుటుంబ కలహాలతో భర్త కు దూరంగా ఉంటున్న దీపికాను భర్తే కిడ్నాప్ చేశాడని పోలీసులు తేల్చారు. అయితే భర్త ఎందుకు కిడ్నాప్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ? ప్రేమించి పెళ్లి చేసుకోవడం తో బలవంతంగా కుటుంబ సభ్యులే భర్త కు దూరం చేశారా? ఇలా జరుగుతుందని ముందే బాధితురాలకు తెలుసా ? ఇప్పుడు ఈ కిడ్నాప్ కేసు ఇలాంటి అనుమానాలకే తావిస్తోంది.

కుటుంబ కలహాలతో…

వికారాబాద్‌కు చెందిన యువతి దీపిక కిడ్నాప్ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.. దీపిక, అఖిల్‌ అలియాస్ ఖలీల్ , 2016లో మతాతంర వివాహం ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం రెండు సంవత్సరాల క్రితం అమ్మాయిని పుట్టింటికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్‌ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది ఈ క్రమంలోనే శనివారం ఇరువురు వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం అదే రోజు సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా.. ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ యువతిని కిడ్నాప్ చేసి కారులో పడేశారు. పక్కనున్న ఆమె సోదరిని బయటకు తోసి కారుతో పరారు అయ్యారు. తమ కూతురిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ దీపిక కుటుంబ సభ్యులు వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ సంజీవరావు తమ సిబ్బందితో వెళ్లి సంఘటన స్ధలంతో పరిశీలించారు. అక్కడ సిసి ఫుటేజ్ లు పరిశీలించారు. దీపికను ఆమె భర్త అఖిలే కిడ్నాప్‌ చేశాడని పోలుసులునిర్ధారించారు.

Tags:    

Similar News