వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర 239వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఆయన నర్సీపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర చేయనున్నారు. విశాఖ జిల్లాలోకి ప్రవేవించిన తర్వాత జగన్ ఆగస్టు 15వ తేదీన ప్రజాసంకల్ప పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. నిన్న శుక్రవారం కావడంతో కోర్టుకు హాజరయ్యేందుకు పాదయాత్రకు విరామమిచ్చారు. తిరిగి ఈరోజు పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈరోజు నర్సీపట్నంలోని మెట్టపాలెం క్రాస్ రోడ్స్, బెన్నవరం మీదుగా నర్సీపట్నం, కృష్ణాపురం, దుగ్ద క్రాస్ రోడ్స్, బయ్యపురెడ్డి పాలెం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. భోజన విరామం అనంతరం బలిఘట్టం మీదుగా నర్సీపట్నం చేరతారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈనియోజకవర్గం మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిది కావడంతో ఆయనపై జగన్ ఎలాంటి విమర్శలు చేస్తారోనని ఇటు తెలుగుదేశం, అటు వైసీపీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.