దేశానికి తప్పని 'సినిమా' పాట్లు
యాత్ర 2 టీజర్ విడుదలైంది. యాత్ర పార్ట్ 1లో వైఎస్ రాజశేఖరరెడ్డి హీరో అయితే, రెండో భాగమంతా జగన్ చుట్టూనే తిరగనుంది. ఈ విషయం టీజర్ చూస్తే అర్థమవతుంది. జగన్‌ను ప్రధాన పాత్రను చేస్తూ రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం కోర్టు చిక్కుల్లో ఇరుక్కున్న విషయం సంగతి తెలిసిందే.
యాత్ర 2 టీజర్ విడుదలైంది. యాత్ర పార్ట్ 1లో వైఎస్ రాజశేఖరరెడ్డి హీరో అయితే, రెండో భాగమంతా జగన్ చుట్టూనే తిరగనుంది. ఈ విషయం టీజర్ చూస్తే అర్థమవతుంది. జగన్‌ను ప్రధాన పాత్రను చేస్తూ రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం కోర్టు చిక్కుల్లో ఇరుక్కున్న విషయం సంగతి తెలిసిందే. అందులో చంద్రబాబు పాత్రను కించపరిచారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. ఎన్నికల్లో జగన్ గెలుపే లక్ష్యంగా సినిమా తీశారని వాళ్లు కోర్టుకు వెళ్లారు.
యాత్ర 2లో కూడా కొన్ని వివాదాస్పద సంభాషణలు ఉన్నాయి. ‘తండ్రి పోయాడనుకుంటే కొడుకు వచ్చాడు’ అని చంద్రబాబు పాత్రధారి చెప్పే డైలాగ్ ఉంది. చివరిలో మమ్ముట్టి (రాజశేఖరరెడ్డి పాత్రధారి) ‘నేను నా ప్రత్యర్థి ఓడిపోవాలని కోరుకుంటాను, మీ నాయకుడిలా నాశనమవ్వాలని కోరుకోను’ అనే మాట కూడా చంద్రబాబును టార్గెట్ చేసినట్లే ఉంది. మరి ఈ డైలాగులపై చంద్రబాబు వర్గం ఏమంటుందో చూడాలి. మళ్లీ కోర్టు మెట్లెక్కుతారా? లేదా చూసీ చూడనట్లు ఊరుకుంటారా?
గత ఎన్నికల ముందు వచ్చిన యాత్ర 1 మంచి విజయం సాధించింది. వైస్సార్ ఎమోషనల్ జర్నీగా దర్శకుడు మహి.వి.రాఘవ మొదటి భాగాన్ని చూపించారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత రెండో భాగాన్ని తెరకెక్కించారు. ఇక్కడ కూడా ఎమోషన్స్‌కే పెద్దపీట వేసినట్లు టీజర్‌లో కనిపిస్తోంది. జగన్ అరెస్ట్, పాదయాత్ర, 2019లో వైకాపా సంచలన విజయం వంటివి యాత్ర 2ని పొలిటికల్ డ్రామాగా కూడా మార్చనున్నాయి.