తిరుపతి వైసీపీ అభ్యర్థి ఆయనే

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. డాక్టర్ గురుమూర్తిని తమ పార్టీ అభ్యర్థిగా వైసీపీ ఖరారు చేసింది. గత కొన్నాళ్లుగా డాక్టర్ [more]

Update: 2021-03-17 00:52 GMT

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. డాక్టర్ గురుమూర్తిని తమ పార్టీ అభ్యర్థిగా వైసీపీ ఖరారు చేసింది. గత కొన్నాళ్లుగా డాక్టర్ గురుమూర్తి పేరు ప్రచారంలో ఉన్నా వైసీపీ అధికారికంగా ప్రకటించలేదు. తిరుపతి ఉప ఎన్నికకు షెడ్యూల్ ఖరారయింది. వచ్చే నెల 17వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. దీంతో గురుమూర్తిని తమ పార్టీ అభ్యర్థిగా వైసీపీ ఖరారు చేసింది. సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఏర్పడిన ఈ ఉప ఎన్నికల్లో ఆయన కుటుంబానికి టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన కుమారుడు బల్లి కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. డాక్టర్ గురుమూర్తి జగన్ పాదయాత్ర సమయంలో ఆర్థోపెడిక్ సర్జన్ గా సేవలందించారు.

Tags:    

Similar News