చంద్రబాబుపై వైసీపీ సంచలన ఆరోపణలు
రూ.17,500 కోట్లకు ఆంధ్రప్రదేవ్ భవిష్యత్ అయిన ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ 2016 [more]
రూ.17,500 కోట్లకు ఆంధ్రప్రదేవ్ భవిష్యత్ అయిన ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ 2016 [more]
రూ.17,500 కోట్లకు ఆంధ్రప్రదేవ్ భవిష్యత్ అయిన ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ 2016 అక్టోబరు 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరుణ్ జైట్లీకి రాసిన లేఖను ఇవాళ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ బయటపెట్టారు. ఈ విషయమై వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ… ఏపీకి ప్రత్యేక హోదానే సంజీవని అని వైసీపీ ఉద్యమాలు చేస్తే చంద్రబాబు మాత్రం ప్యాకేజీ కావాలని ఏపీకి ద్రోహం చేశారన్నారు. సంవత్సరానికి 3,500 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.17,500 కోట్లు ఇస్తే ప్రత్యేక హోదా అవసరం లేదని చంద్రబాబు స్వయంగా లేఖ రాసిన విషయం బయటపడిందన్నారు.
వారు ఆంధ్రా ద్రోహులు
ప్రత్యేక హోదా వద్దని లేఖ రాసిన చంద్రబాబు ఆంధ్రాద్రోహి అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల వేళ నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి మోడీకి హోదాను తాకట్టుపెట్టిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. మోడీతో పాటు చంద్రబాబు, ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర ద్రోహులన్నారు. ఆంధ్రప్రదేశ్ ను ప్రేమించే ప్రతీ వ్యక్తి ఆలోచించాలని, యువత భవిష్యత్ ను నాశనం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అవసరమా అని ప్రశ్నించారు.