జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ.. వివేకా హత్య కేసును?

ఏపీలో జగన్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. హత్య కేసులో ఎలాంటి పురోగతి [more]

Update: 2020-03-11 10:59 GMT

ఏపీలో జగన్ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. హత్య కేసులో ఎలాంటి పురోగతి లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. హత్య జరిగి ఏడాది గడుస్తున్నా ఇంతవరకూ హత్యకు గల కారణాలు, నిందితులు ఎవరో తేల్చలేకపోయిందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే వివేకా హత్య కేసును సీబీఐ కి అప్పగిస్తున్నట్లు తీర్పు చెప్పింది. పులివెందుల పోలీస్ స్టేషన్ నుంచే దర్యాప్తు ప్రారంభించాలని హైకోర్టు ఆదేశించింది. వీలయినంత త్వరగా కేసును పరిష్కరించాలని హైకోర్టు కోరింది. వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్య, కూతురు సునీత కేసును సీబీఐ కి అప్పగించాలంటూ హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News