జగన్ ధైర్యం చూడండి

Update: 2018-06-27 13:38 GMT

బంగీ జంప్...అదేనండీ..వందల అడుగుల ఎత్తు నుండి తాళ్లు కట్టుకుని కిందకు దూకడం. ఇది ఒకరకమైన సాహసమే. బంగీ జంప్ లో ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అంత ఎత్తు నుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అటువంటిది దూకాలంటే మామూలు విషయం కాదు. ఈ ఫీట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చేసి చూపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇవాళ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, పాదయాత్రలో బిజీగా ఉన్న జగన్ బంగీ జంప్ చేసేందుకు ఎక్కడికి వెళ్లాడని ఆశ్చరపోకండి. ఆ జంపు, ఆ ఫోటోలు ఇప్పటివి కాదు. పాదయాత్రకు ముందు ఆయన కుటుంబసమేతంగా న్యూజిల్యాండ్ పర్యటనకు వెళ్లినప్పటివి. అక్కడి కవారౌ బ్రిడ్జిపై నుంచి ఆయన బంగీ జంప్ చేశారు. కొద్దిగా కూడా భయం ముఖంలో లేకుండా చిరునవ్వుతోనే ఆయన ఈ జంప్ చేశారు. ఈ ఫోటోలు చూసి వైసీపీ శ్రేణులు తమ అధేనేత ధైర్యం పట్ల తెగ సంబరపడిపోతున్నారు.

 

Similar News