చంద్రబాబుకు ఆ ధైర్యం కూడా లేదు..!
ఐదేళ్లుగా ప్రజల తరపున పోరాటం చేసిన తనపై చంద్రబాబు 22 కేసులు పెట్టారని, చంద్రబాబుతో పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న పవన్ కళ్యాణ్ పై ఒక్క కేసు కూడా [more]
ఐదేళ్లుగా ప్రజల తరపున పోరాటం చేసిన తనపై చంద్రబాబు 22 కేసులు పెట్టారని, చంద్రబాబుతో పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న పవన్ కళ్యాణ్ పై ఒక్క కేసు కూడా [more]
ఐదేళ్లుగా ప్రజల తరపున పోరాటం చేసిన తనపై చంద్రబాబు 22 కేసులు పెట్టారని, చంద్రబాబుతో పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న పవన్ కళ్యాణ్ పై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ముమ్మడివరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… ఐదేళ్ల పాలనను చూపించి ఓట్లడిగే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదన్నారు. అందుకే ఆయన పాలనపై ప్రజల్లో చర్చ జరగకుండా రోజుకో కొత్త ఆరోపణలను తెరపైకి తెస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఆరోపణలనే ఆయన పార్ట్ నర్ పవన్ కళ్యాణ్ చెస్తారని, టీడీపీ పత్రికలు, ఛానళ్లు చూపిస్తాయన్నారు. చంద్రబాబు పాలనపై ఆయన పార్ట్ నర్ కే నమ్మకం లేనందున నాలుగేళ్లు కలిసుండి ఇప్పుడు విడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
ఢిల్లీ నుంచి నాయకులను తెస్తున్నారు…
రాష్ట్రంలో చంద్రబాబుతో నేరుగా పొత్తు పెట్టుకోవాలంటేనే పార్టీలు బయపడుతున్నాయన్నారు. ఇక లాభం లేదని ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయకులను తీసుకువచ్చి తనపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. ఎన్నికలు వచ్చాయని డబ్బుతో గెలవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు మోసపోవద్దని, ఇచ్చిన హామీలను అమలు చేయని చంద్రబాబును ఓడించాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తీసుకువచ్చే నవరత్నాలతో ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. ఎన్నికలు రాకపోయి ఉంటే, తాను హామీ ఇవ్వకపోతే చంద్రబాబు రూ.2 వేలు పింఛన్ ఇచ్చేవారా అని ప్రశ్నించారు.