బాబుకు కౌంటర్.. భారీ హామీ ప్రకటించిన జగన్

తాము అధికారంలోకి వస్తే పింఛన్లను రూ.3 వేలకు పెంచుతామని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతిలో వైసీపీ ఎన్నికల సమర శంఖారావం జరిగింది. [more]

Update: 2019-02-06 11:19 GMT

తాము అధికారంలోకి వస్తే పింఛన్లను రూ.3 వేలకు పెంచుతామని ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతిలో వైసీపీ ఎన్నికల సమర శంఖారావం జరిగింది. పెద్దఎత్తున హాజరైన బూత్ కమిటీల సభ్యులతో జగన్ మాట్లాడుతూ… ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా చంద్రబాబు రోజుకో సినిమా చూపిస్తున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్, మోదీతో కలిసి చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని… ఇప్పుడు మాత్రం రోజుకో డ్రామాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇన్నాళ్లు ప్రత్యేక హోదా పేరు ఎత్తితే అరెస్టు చేయించిన చంద్రబాబు.. ఇప్పుడు నల్ల చొక్కాలు వేసుకొని డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.

పార్టీ శ్రేణులంతా కుటుంబసభ్యులు

మరో రెండు నెలల పాటు బూత్ కమిటీ సభ్యులంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఓటర్ల తొలగింపు, అక్రమ ఓటర్లపై జాగ్రత్తగా ఉండాలన్నారు. రానున్న ఎన్నికలు ధర్మానికి.. అధర్మానికి మధ్య, న్యాయానికి.. అన్యాయానికి మధ్య జరుగుతున్నవన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కరితోనే తాము పోటీ పడటం లేదని.. యెల్లో మీడియా, డబ్బు, అన్యాయంతో పోరాడాలని పేర్కొన్నారు. మిగతా పార్టీల్లో పార్టీ శ్రేణులంతా కార్యకర్తలని… తనకు మాత్రం వైసీపీ శ్రేణులంతా తన కుటుంబసభ్యులతో సమానమన్నారు.

Tags:    

Similar News