వినూత్నంగా సాగిన జగన్ ‘సమర శంఖారావం’
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. తిరుపతిలో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బూత్ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం [more]
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. తిరుపతిలో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బూత్ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం [more]
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. తిరుపతిలో ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బూత్ కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం జగన్ వినూత్నంగా నిర్వహించారు. మొదట వేదిక మీద నుంచి మాట్లాడిన ఆయన తర్వాత నేరుగా పార్టీ కార్యకర్తల్లోకి వెళ్లారు. కార్యకర్తలు వారి అనుమానాలను వారి పేరు, ఊరు, బూత్ నెంబర్ తో పాటు చిట్టీల్లో రాసి ఇచ్చారు. ఇలా కార్యకర్తల రాసిచ్చిన చిట్టీలను మాజీ ఎంపీ మిథున్ రెడ్డి చదువుతుంటే జగన్ వాటికి సమాధానాలు ఇచ్చారు.
బీజేపీపై జగన్ విమర్శలు…
ఎవరితో పొత్తు పెట్టుకోవద్దు అని ఓ కార్యకర్త చేసిన సూచనపై జగన్ మాట్లాడుతూ… వైసీపీ ఇంతకుముందు కూడా ఎవరితో పొత్తు పెట్టుకోలేదని, ఇప్పుడు కూడా పెట్టుకోమని స్పష్టం చేశారు. ఇక, బీజేపీపై కూడా జగన్ విమర్శలు గుప్పించారు. తిరుపతి దైవసాక్షిగా నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని విస్మరించారని ఆరోపించారు. రాష్ట్రాన్ని మోసం చేసిన పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోమని స్పష్టం చేశారు. ఎన్నికల కోసమే మూడు నెలల ముందు చంద్రబాబు పథకాలు పెడుతున్నారనే విషయాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. చీకటి తర్వాత వెలుగు కచ్చితంగా ఉంటుందని… వైసీపీ అధికారంలోకి వచ్చాక తనతో పాటు కష్టాలు అనుభవించిన పార్టీ కార్యకర్తలకు కచ్చితంగా తోడుంటానని హామీ ఇచ్చారు.