పాలనను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం

3,648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు, తొమ్మిదేళ్లు ప్రజల్లో ఒకడిగా ఉన్నందుకు ఆకాశమంత విజయాన్ని అందించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ముఖ్యమంత్రి వైఎస్ [more]

Update: 2019-05-30 07:58 GMT

3,648 కిలోమీటర్లు ఈ నేల మీద నడిచినందుకు, తొమ్మిదేళ్లు ప్రజల్లో ఒకడిగా ఉన్నందుకు ఆకాశమంత విజయాన్ని అందించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రమాణస్వీకారం అనంతరం ఆయన పింఛన్లను రూ.2,250కి పెంచుతూ మొదటి సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ‘‘పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో, పాదయాత్రలో పేదలు పడిన కష్టాలను చూశాను. మధ్య తరగతి ప్రజల కష్టాలను విన్నాను. మీ కష్టాలు చూశాక, విన్నాక ఇవాళ ముఖ్యమంత్రిగా ‘నేను ఉన్నాను’ అని చెబుతున్నాను. అందరి ఆశలు, ఆకాంక్షలు పూర్తిగా పరిగణలోకి తీసుకుంటూ రెండే పేజీలతో ఎప్పుడూ ప్రజలకు గుర్తుండే విధంగా ప్రజల కష్టాలను తీర్చేందుకు మేనిఫెస్టోను తీసుకువచ్చాను.

అందరికీ అందేలా….?

గత ప్రభుత్వాల మాదిరిగా బుక్కుల కొద్దీ మేనిఫెస్టోలు తీసుకురాలేదు. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి మేనిఫెస్టోనే ఊపిరిగా ఈ ఐదేళ్లు ప్రజల కోసం పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. సంవత్సరానికి రూ.250 చొప్పున పింఛన్లు పెంచుతాను. నవరత్నాలు ప్రతీ పేదవాడికి అందాలి. కులాలు చూడవద్దు, మతాలు చూడవద్దు. పార్టీలు కూడా చూడవద్దు. ఇది జరగాలి ఉంటే వ్యవస్థలోకి విప్లవాత్మక మార్పులు తీసుకురావాలి. ఇందుకోసం ఆగస్టు 15 నాటికి గ్రామ వాలంటీర్లుగా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు లంచాలు లేని పరిపాలన దిశగా ప్రతీ 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ ను నియమిస్తాం. ప్రతీ గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తాం. ఏ పథకం కోసమైనా అప్లికేషన్ పెట్టిన 72 గంటల్లో మంజూరయ్యేలా చేస్తాం. పూర్తిగా లంచం అనేది లేకుండా, రికమెండేషన్ కు తావు లేకుండా అన్ని పథకాలను ప్రజలకు చేరుస్తాం.’’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News