ఇచ్చిన మాట ప్రకారమే

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారమే నవంబరు 1వ తేదీన పోలవరం పనులు ప్రారంభమవుతున్నాయని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. [more]

Update: 2019-11-01 06:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారమే నవంబరు 1వ తేదీన పోలవరం పనులు ప్రారంభమవుతున్నాయని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈరోజు మెఘా కన్ స్ట్రక్షన్స్, ప్రభుత్వం కలసి పోలవరం ప్రాజెక్టు వద్ద భూమి పూజ నిర్వహించనున్నారు. జగన్ మొదటి నుంచి చెబుతున్నట్లుగానే నవంబరు 1వ తేదీన పోలవరం పనులను ప్రారంభించి రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగా తాము అబద్ధాలు చెప్పమని, చెప్పబోమని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారని, ఆయన తనయుడు వైఎస్ జగన్ దానిని ప్రారంభిస్తారని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.

Tags:    

Similar News