ఆందోళ‌న వ‌ద్దు… నెల రోజుల్లో ర‌ద్దు చేస్తాం

ప్ర‌భుత్వ ఉద్యోగులు సీపీఎస్ విధానంపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, అధికారంలోకి వ‌చ్చాక నెల‌రోజుల్లో సీపీఎస్ విధానం ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి [more]

Update: 2019-02-07 08:24 GMT

ప్ర‌భుత్వ ఉద్యోగులు సీపీఎస్ విధానంపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, అధికారంలోకి వ‌చ్చాక నెల‌రోజుల్లో సీపీఎస్ విధానం ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం క‌డ‌ప‌లో అన్న‌పిలుపు కార్య‌క్ర‌మంలో భాగంగా త‌ట‌స్థుల‌తో ఆయ‌న ముఖాముఖి స‌మావేశ‌మ‌య్యారు. వారి నుంచి స‌ల‌హాలు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ… వైసీపీ అధికారంలోకి రాగానే గ్రామ స‌చివాల‌యం వ్య‌వ‌స్థ ఏర్పాటు చేస్తామ‌ని, దేశం మొత్తం ఇటువైపు చూసేలా ఈ వ్య‌వ‌స్థ ఉంటుంద‌న్నారు. వ్య‌వ‌సాయ కోర్సులు చేసిన విద్యార్థుల‌కు వాటిల్లో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌న్నారు. వ్య‌వ‌సాయంలోనూ విప్ల‌వాత్మ‌క మార్పులు తెస్తామ‌ని, పంట‌లు వేసే ముందు కొనుగోలు చేసే ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తామ‌న్నారు. 3 వేల కోట్ల ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఇక‌, ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసం ఒక్కో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తామ‌ని పేర్కొన్నారు.

 

Tags:    

Similar News