సీఎం జగన్ కు ఓ బాలిక ఆవేదన…?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఓ బాలిక లేఖ రాసింది. నెల్లూరు జిల్లాకు చెందిన అనుపమ ఇటీవల మరణించింది. అయితే అనుపమ డెత్ సర్టిఫికేట్ కోసం కుటుంబ [more]

;

Update: 2021-06-20 05:34 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఓ బాలిక లేఖ రాసింది. నెల్లూరు జిల్లాకు చెందిన అనుపమ ఇటీవల మరణించింది. అయితే అనుపమ డెత్ సర్టిఫికేట్ కోసం కుటుంబ సభ్యులు అధికారుల చుట్టూ ఎంత తిరిగినా ఫలితం లేదు. దీంతో అనుపమ కుమార్తె సీఎం జగన్ కు లేఖ రాసింది. తన తల్లి అనుపమ చనిపోయిన నలభై రోజులయిందని, డెత్ సర్టిఫికేట్ కోసం పంచాయతీ సెక్రటరీ దగ్గరకు వెళితే ఇవ్వలేదన్నారు. తన తల్లి నెల్లూరు లో చనిపోవడంతో సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదన్నారు. అలాగే మున్సిపాలిటీ నుంచి డెత్ సర్టిఫికేట్ ఇస్తారని, మరికొందరు పంచాయతీ కార్యాలయం నుంచి వస్తుందని చెబుతున్నారని ఆ బాలిక జగన్ కు రాసిన లేఖలో తెలిపింది. తన తల్లి సర్టిఫికేట్ వెంటనే మంజూరు చేయించాలని ఆ బాలిక జగన్ ను కోరింది.

Tags:    

Similar News