ఆగిపోవడానికి బాబే కారణమన్న జగన్

నవంబరు 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పనులు ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఆగస్టు, సెప్టంబరు, అక్టోబరు నెలలో వరదలు వస్తాయి కాబట్టి [more]

Update: 2019-07-19 04:37 GMT

నవంబరు 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పనులు ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఆగస్టు, సెప్టంబరు, అక్టోబరు నెలలో వరదలు వస్తాయి కాబట్టి నవంబరు నుంచి పోలవరం పనులు ప్రారంభమవుతాయన్నారు. అనుకున్న సమయానికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. నాలుగు నెలలుగా పనులు ఆగిపోవడానికి చంద్రబాబే కారణమన్నారు. గత ప్రభుత్వం స్పిల్ వే పనులు పూర్తి చేయకుండా కాఫర్ డ్యాం పనులు ప్రారంభించిందన్నారు. గత ప్రభుత్వం పోలవరం పనులన్నింటినీ నామినేషన్ పద్ధతిలో తమ వారికే పనులు అప్పగించిందన్నారు. పోలవరంపై కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నారు జగన్. రివర్సింగ్ టెండరింగ్ లో ప్రభుత్వానికి పదిహేను నుంచి ఇరవై శాతం సొమ్ము ఆదా అవుతుందన్నారు. దీనిపై కమిటీ వేశామని త్వరలో దీనిపై నివేదిక వచ్చాక చర్యలు ప్రారంభిస్తామని జగన్ పోలవరంపై ఒక ప్రశ్నకు సమాధానంగా శాసనసభలో వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News