నిత్యం జగన్ జపమేనా..?

ఐదేళ్లు పరిపాలన చేసి కూడా ప్రజలకు ఏం చేశారో చెప్పి చంద్రబాబు ఓట్లు అడగలేకపోతున్నారని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరు [more]

Update: 2019-03-29 06:54 GMT

ఐదేళ్లు పరిపాలన చేసి కూడా ప్రజలకు ఏం చేశారో చెప్పి చంద్రబాబు ఓట్లు అడగలేకపోతున్నారని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ… ఐదేళ్ల పరిపాలన తర్వాత 2009లో తాను చేసిన పనులు చెప్పి వైఎస్సార్ ఓట్లడిగారని, ఆ ధైర్యం చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. నిరంతరం జగన్ జపం చేస్తున్నారని, వారు చేసే విమర్శలే జగన్ కు ఆశీర్వాదాలవుతాయన్నారు. ప్రజల కోసం నిరంతరం పాటుబడుతున్న తమ కుటుంబంపై ఎందుకు ఇంత శతృత్వమని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసుపై థర్డ్ పార్టీ విచారణ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ పై ఆరోపణలు చేస్తే కుమారుడని కూడా చూడకుండా వైఎస్సార్ సీబీఐ విచారణ వేశారన్నారు. నా కొడుకు తప్పు చేసి ఉంటే ఉరిశిక్ష వేయాలని వైఎస్ చెప్పారని గుర్తు చేశారు.

రాజన్న రాజ్యాన్ని గుర్తు తెచ్చుకోండి

చంద్రబాబుపై హత్యాయత్నం జరిగినప్పుడు వైఎస్ పలుకరించి మావోయిస్టుల చర్యలకు నిరసనగా ధర్నా చేశారని గుర్తు చేశారు. కానీ వివేకానందరెడ్డి హత్య జరిగితే చంద్రబాబు పుత్రరత్నం పరవశిస్తున్నానని చెబుతున్నారన్నారు. జగన్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కాంగ్రెస్ లో ఉన్నంతకాలం జగన్ పై కేసులు లేవని, బయటకు వచ్చాకే కుట్రతో కేసులు పెట్టారని తెలిపారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా జగన్ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టారని, ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి పులే.. నక్క నక్కే అని పేర్కొన్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాలతో ప్రజల జీవితాల్లో సంపూర్ణ మార్పు వస్తుందన్నారు. అన్ని వర్గాలూ బాగుపడతాయని పేర్కొన్నారు. ధర్మానికి, అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధం జరుగుతుందని ప్రజలంతా విలువలు, విశ్వసనీయత కలిగిన జగన్ కు ఓటేయాలని కోరారు. వైఎస్సార్ పాలన గుర్తు చేసుకోవాలని, మళ్లీ ఆయన పాలన రావాతంటే జగన్ తోనే సాధ్యమన్నారు.

Tags:    

Similar News