వివేకా హత్య ఎందుకు జరిగిందో..?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. వివేకాహత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించలేకపోతున్నారు. వివేకా హత్య జరిగి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ, ఇప్పటికీ హత్యకు [more]

Update: 2019-09-03 08:02 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. వివేకాహత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించలేకపోతున్నారు. వివేకా హత్య జరిగి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ, ఇప్పటికీ హత్యకు గల కారణాలను పోలీసులు కనుగొనలేకపోయారు. చంద్రబాబు ప్రభుత్వంలో రెండు నెలలు, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు నెలలు హత్య కేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ ను వేసినా ఈ హత్య కేసులో పురోగతి లేదనే చెప్పాలి.

పురోగతి లేని కేసు…..

ఇప్పటి వరకూ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 1300 మందిని విచారించారు. ఇందులో ముగ్గురికి నార్కో అనాలిసిస్ టెస్ట్ లను చేశారు. వాచ్ మెన్ రంగయ్యతో పాటుగా గంగిరెడ్డి, శేఖర్ లకు నార్కో అనాలిసిస్ టెస్ట్ లను నిర్వహించారు. మరో అనుమానితుడు పరమేశ్వర్ రెడ్డి నార్కో అనాలిసిస్ టెస్ట్ లకు హాజరు కాలేదు. ఆరోగ్యం సరిగా లేదంటూ గైర్హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 14మందిని నిందితులుగా చేర్చారు. హత్య జరగడానికి ముందు వైఎస్ వివేకానందరెడ్డి 700 ఫోన్ కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాల్ప్ పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద వైెస్ వివేకా హత్య కేసు మిస్టరీని ఇప్పటి వరకూ పోలీసులు ఛేదించకపోవడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ఐదు నెలల నుంచి ఆయనను ఎందుకు హత్య చేశారో కూడా తెలియక పోవడం పోలీసు విచారణ ఏ విధంగా సాగుతుందో అర్థమవుతుంది.

Tags:    

Similar News