టీడీపీలో చేేరేందుకు రెడీ అయిపోయారా?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఏపీలో కలలకం రేపుతుంది. సీబీఐ ఛార్జి షీటు వేయడంతో మరింత వేడెక్కింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఏపీలో కలలకం రేపుతుంది. సీబీఐ ఛార్జి షీటు వేయడంతో మరింత వేడెక్కింది. అయితే ఈ హత్య కేసు రాజకీయంగా అనేక మలుపులు తిరుగుతుంది. రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కడప జిల్లా నేతలతో సమావేశమయ్యారు. నేతల మధ్య ఐక్యత లేదని ఆయన గట్టిగానే నేతలను మందలించారు. నెలకు ఒకసారి సమావేశమై స్థానిక సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు చేరువ అవ్వాలని ఆయన గట్టిగానే చెప్పారు.
జగన్ పై వ్యతిరేకత....
మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తర్వాత జగన్ తన సొంత జిల్లా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కడప జిల్లాలో టీడీపీకి సరైన నేతల్లేరు. ఉన్న నేతలందరూ ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ లు బీజేపీలోకి వెళ్లగా, రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు కడప జిల్లలోని అనేక నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి నేతల కొరత ఉందని చెప్పాలి.
తన తండ్రి హత్య కేసులో....
ిఇక తన తండ్రి హత్య తో వివేకా కుమార్తె సునీత కసితో రగిలిపోతున్నారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడేలా చేయాలని ఆమె నిరంతరం ప్రయత్నిస్తున్నారు. జగన్ కుటుంబంతోనూ ఆమె పెద్దగా కలవడం లేదు. సీబీఐ విచారణ కోరి ఆమె వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టారంటున్నారు. తమ తండ్రిని చంపిన వారికి ఖచ్చితంగా శిక్ష పడేందుకు తాను ఎలాంటి అడుగులు వేయడానికి అయినా సిద్దమని సునీత తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
టీడీపీ ఆహ్వానం.....
కాగా సునీతను తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. కడప జిల్లాలో తమకు బలం లేకపోవడం, సునీత పార్టీలోకి వస్తే ఆ ప్రభావం అనేక నియోజకవర్గాల్లో ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే సునీత మనసులో మాటను కనుక్కునేందుకు కడప జిల్లాకు చెందిన ఒక నేతను పంపినట్లు చెబుతున్నారు. ఈ విషయంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అనుమానం వ్యక్తం చేశారు. మొత్తం మీద సునీత టీడీపీలో చేరితే వైసీపీకి రాజకీయంగా ఎదురుదెబ్బ అని చెప్పకతప్పదు.