బ్రేకింగ్ : వివేకా హత్య ఆ గ్యాంగ్ చేసిందేనా?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేసులో అనుమానితుడు శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య వెనక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ [more]

Update: 2019-10-13 05:01 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేసులో అనుమానితుడు శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య వెనక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన సునీల్ గ్యాంగ్ తో శ్రీనివాసరెడ్డికి సంబంధాలున్నాయని పోలీసులు గుర్తంచారు. శ్రీనివాసరెడ్డి వెనక పెద్దలు ఎవరున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా హత్యకు గల కారణాలు, హంతకులు ఎవరో ఇప్పటి వరకూ తెలియలేదు. అయితే తాజాగా పోలీసులు ప్రొద్దుటూరు సునీల్ గ్యాంగ్ ను గుర్తించారు. వివేకా హత్య వెనక పెద్దల ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News