ఫోన్ ట్యాపింగ్ పై సాక్షాలు సమర్పించిన వైసీపీ

రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సీఈసీ సునీల్ [more]

Update: 2019-03-22 12:43 GMT

రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సీఈసీ సునీల్ అరోరాను ఆయన కలిసి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో అధికార దుర్వనియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. డీజీపీ ఠాకూర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నందున ఎన్నికల విధుల నుంచి ఆయనను తప్పించాలని కోరారు. చట్టాన్ని అతిక్రమిస్తున్న పోలీసులను తొలగించాలని వినవించారు. పోలీసుల సహకారంతో డబ్బులు తరలిస్తున్న సాక్ష్యాధారాలను ఎన్నికల సంఘానికి ఇచ్చినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. తమ పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, అధికారి యోగానంద్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్లు ఆధారాలు సమర్పించినట్లు తెలిపారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు తమ పార్టీ గుర్తును పోలి ఉందని, వారి గుర్తును మార్చాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు.

Tags:    

Similar News